Oct 28,2021 19:10

matladutunna kaile anil kumar

రైతుల సంక్షేమానికి అధిక ప్రాధాన్యత
కెడిసిసి బ్యాంక్‌ చైర్మన్‌ తన్నీరు నాగేశ్వరరావు
ప్రజాశక్తి-పమిడిముక్కల
వ్యవసాయం బలోపేతం కావటానికి గాను రైతుల సంక్షేమానికి రాష్ట్రప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తోందని కృష్ణాజిల్లా సహకార కేంద్ర బ్యాంక్‌ చైర్మన్‌ తన్నీరు నాగేశ్వరరావు అన్నారు. పమిడిముక్కల మండలంలోని అమీనాపురంలో రాజరాజేశ్వరి కేంద్ర వ్యవసాయ కోపరేటివ్‌ బ్యాంక్‌కు గురువారం ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా నాగేశ్వరరావు మాట్లాడుతూ కృష్ణా జిల్లా సహకార కేంద్ర బ్యాంక్‌ ద్వారా రైతులకు వివిధ రూపాల్లో రుణాలను అందజేస్తున్నామన్నారు. రైతులకు వ్యవసాయం నిమిత్తం అనేక పథకాలు, కార్యక్రమాలను అమలు చేస్తున్నామన్నారు. రైతులు, కౌలు రైతులం సంక్షేమానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నామని వివరించారు. డ్వాక్రా మహిళలు ఆర్థికంగా బలోపేతం కావటానికి కూడా కృషిచేస్తున్నామని వివరించారు. పామర్రు శాసనసభ్యులు కైలే అనిల్‌ కుమార్‌ మాట్లాడుతూ రాష్ట్రంలోని వైసిపి ప్రభుత్వం రైతుల సంక్షేమానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తోందన్నారు. రైతులకు సకాలంలో విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు కోఆపరేటివ్‌ సొసైటీల ద్వారా అందించటానికి చర్యలు తీసుకుంటున్నామన్నారు. రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు అందేలా కృషిచేస్తున్నామన్నారు. వీరంకిలాకు, పత్తిలంక, అమీనాపురంలో పిఎసిఎస్‌ల ద్వారా రైతులు రుణాలను పొందుతున్నారన్నారు. చెరకు రైతులను ఆదుకోవాలని మాజీ ఎంపీటీసీ రాము కోరారు. ఈ కార్యక్రమంలో వైసిపి పమిడిముక్కల మండల అధ్యక్షులు యలమంచిలి గణేష్‌, పమిడిముక్కల ఎంపిపి కాసాని వేద సుప్రజ, వైసిపి నాయకులు మైనేని కోటేశ్వరావు, పాతూరి చంద్రపాల్‌, మారుపాక మహేష్‌, రాంబాబు, ఉదయ తుల్లా, ఎంపిడిఒ నాంచారరావు, తహశీల్దార్‌ కట్టా వెంకట శివయ్య, పంచాయతీరాజ్‌ ఎఇ షెరాబాన్‌రాజు, అమీనాపురం పిఎసిఎస్‌ అధ్యక్షులు కోటంరాజు, కోపరేట్‌ బ్యాంక్‌ మేనేజర్‌ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.