May 18,2021 22:11

రికార్డులను పరిశీలిస్తున్న ఎఒ

ప్రజాశక్తి - సి బెళగల్‌: మండలంలో రైతుభరోసా రానివారి రైతుల జాబితా తయారు చేయాలని ఏఓ సురేష్‌ రెడ్డి సంబంధిత వ్యవసాయ సహాయకులకు ఆదేశించారు. మంగళవారం మండలంలోని కొండాపురం, బ్రాహ్మణదొడ్డి గ్రామాల్లో రైతుభరోసా కేంద్రాలను ఆయన తనిఖీ చేశారు. రైతుభరోసా పథకం అందకుండా ఇబ్బందులు పడుతున్న రైతులు తమ వివరాలను సంబంధిత కేంద్రంలో ఇవ్వాలన్నారు. అలాగే ఖరీఫ్‌ సాగులు మొదలవుతున్నందున వేరుశనగ, శనగ విత్తనాలు సిద్ధంగా ఉన్నాయని, అందులో ముందుగా రిజిస్టార్‌ చేసుకోవాలని తెలిపారు. కార్యక్రమంలో సహాయకులు చెంచురాజు, రాజశేఖర్‌, నాయక్‌, రైతులు తదితరులు పాల్గొన్నారు.