Nov 30,2020 22:02

జలుమూరు : మాట్లాడుతున్న కృష్ణచైతన్య

ప్రజాశక్తి- జలుమూరు : రైతు సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం పని చేస్తోందని వైసిపి యువ నాయకులు డాక్టర్‌ ధర్మాన కృష్ణచైతన్య అన్నారు. సోమవారం మండల కేంద్రంలోని మార్కెట్‌ కమిటీ కార్యాలయం వద్ద ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రైతు అభివృద్ధి కోసమే రైతు భరోసా కేంద్రాలు పెట్టి సూచనలు, సలహాలు ఇస్తున్నామన్నారు. కార్యక్రమంలో ఎఎంసి చైర్మన్‌ మొజ్జాడ నిర్మల శ్యామలరావు, మాజీ ఎంపిపి బగ్గు రామకృష్ణ, అల్లాడ, చల్లవానిపేట పిఎసిఎస్‌ అధ్యక్షులు పొన్నాన ముసలినాయుడు, బుక్క లక్ష్మణరావు, వాన గోపి, దామోదరరావు, దుంగ ప్రసాదరావు, కూన వెంకటరమణ పాల్గొన్నారు.
బోరుభద్రలో...
సంతబొమ్మాళి :
మండలంలోని బోరుభద్ర రైతుభరోసా కేంద్రం వద్ద ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మండల వ్యవసాయ శాఖ అధికారి శ్రీలక్ష్మి, కార్యదర్శి రామకృష్ణ ప్రారంభించారు. దళారీ వ్యవస్థ నిర్మూలనకు నేరుగా రైతుల వద్ద నుంచే ధాన్యం కొనుగోలు చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ప్రారంభిస్తుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో వైసిపి నాయకులు ముద్దపు ఆనందరావు, ఎన్ని మన్మథరావు, రమణ, సీతారం హరి పాల్గొన్నారు.