Nov 30,2020 21:58

పెడన : నివర్‌ తుఫాన్‌ నేపథ్యంలో పెడన మండలంలో వివిధ గ్రామాలకు చెందిన రైతులు తమ పొలాల్లోని నీటిలో తడిసిపోయిన వరి పనలను కూలీల సహాయంతో మోపులు కట్టి రోడ్లపైకి చేరవేస్తున్నారు. మరికొంతమంది రైతులు తడిసిన మొక్క వచ్చిన ధాన్యాన్ని ఆరబెడుతున్నారు. మరికొంతమంది రైతులు ఇప్పటి కోత కోయకుండా పూర్తిస్థాయిలో పొలాలు నీటిలో తేలాడుతున్నాయి. పెడన నియోజకవర్గంలో పెడన, గూడూరు, బంటుమిల్లి, కృత్తివెన్ను మండలాల్లో ఇదే పరిస్థితి నెలకొంది. పెడన మండలంలో కొంకెపూడి, నడుపూరు, కోడూరు, నందిగామ, దావోజిపాలెం, ఎస్‌వి పల్లి, పెనుమల్లి, నేలకొండపల్లి, చోడవరం, పుల్లలపాడు, నందమూరు, బల్లిపర్రు తదితర గ్రామాల్లో రైతులు పలు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు మరో తుఫాను ఉంది అనే హెచ్చరికలతో మరింత ఆందోళనకు గురవుతున్నారు.