
మాట్లాడుతున్న మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి
రైతాంగాన్ని భారీగా దెబ్బతీసిన తుపాన్
ప్రజాశక్తి-నెల్లూరు:నివర్ తుపాన్ రాష్ట్రంలోని రైతాంగాన్ని భారీగా దెబ్బతీసిందని, ముఖ్యంగా పేదల జీవితంపై తీవ్ర ప్రభావం చూపిందని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి అన్నారు. సోమవారం నగరంలోని టిడిపి జిల్లా కార్యాలయంలో విలేకర్ల సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో 12 లక్షల ఎకరాల పంట తుపాన్‌తో దెబ్బతిందన్నారు.ఈ ఏడాది రైతులు 8 వేల కోట్ల మేరకు నష్టపోయారన్నారు. టిడిపి ప్రభుత్వ హయాంలో ప్రకతి వైపరీత్యాలు సంభవించిన సమయంలో ఎన్డి ఆర్ఎఫ్ మార్గదర్శకాలను సైతం పక్కన పెట్టి రైతులను ఆదుకున్నామన్నారు. రైతు భరోసా పేరుతో ఒక కుటుం బానికి ఎన్ని ఎకరాలున్నప్పటికీ రూ.7,500 ఇస్తాం అని చెప్పడం సరికాదన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి వరి పంటలో నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.15 వేలు పరిహారం అందజేసి ఆదుకోవా లన్నారు. అరటి, తమలపాకు తోటల రైతులకు ఎకరాకు రూ.25 వేలు, వరద ముంపునకు గురై జీవనో పాధి కోల్పోయిన పేదలకు రూ.10 వేలు ఆర్థిక సాయం చేయడంతో పాటు 25 కిలోల బియ్యం అందిం చాలన్నారు. పెన్నానదికి నీళ్లు వదిలేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాల్సిన బాధ్యత ఇరిగేషన్ అధికారులపై ఉన్నప్పటికీ ఆ దిశగా ఆలోచనలు చేయకపోవడం దారుణమన్నారు. జిజిహెచ్‌లో విద్యుత్ సరఫరా లేక రోగులు ప్రాణాలు కోల్పోతుంటే ప్రభుత్వం పట్టించు కోకపోవడం దారణమన్నారు. సమావేశంలో పార్లమెంటరీ నియోజకవర్గ అధ్యక్షుడు అబ్దుల్ అజీజ్, నెల్లూరు సిటీ ఇన్ చార్జి కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి పాల్గొన్నారు.