Mar 02,2021 23:02

రేషన్‌ బియ్యాన్ని పరిశీలిస్తున్న ఎస్‌ఐ చౌడయ్య

ప్రజాశక్తి - మార్టూరు రూరల్‌ : మండల పరిధిలోని వలపర్లలో ఓ రైస్‌ మిల్లుపై పోలీసులు మంగళ వారం దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా రేషన్‌ బియ్యం అక్రమంగా తరలిసేందుకు సిద్ధం చేసిన వాహనాలను అదుపులోకి తీసుకొని బియ్యాన్ని స్వాధీనం చేసు కున్నారు.మార్టూరు ఎస్‌ఐ చౌడయ్య వివరాల ప్రకారం... వలపర్లలోని విజయ సాయి కష్ణ రైస్‌ మిల్లులో అక్రమంగా రేషన్‌ బియ్యం నిల్వలు వున్నాయని సమాచారం అందింది. దీంతో ఎస్‌ఐ పోలీస్‌ సిబ్బందితో దాడులు నిర్వహించారు. ఈ సంద ర్భంగా బస్తాలు, విడిగా కుప్పగా పోసిన రేషన్‌ బియాన్ని గుర్తించారు. ఇతర ప్రాంతాలకు తరలించటానికి రెండ్లు వాహనాలలో లోడ్‌ చేసి ఉన్న బస్తాలను గుర్తిం చారు. వాహనాలను స్వాధీనం చేసు కున్నారు. వాహనాల్లో 500 బస్తాలు ఉంటాయని అధి కారులు అంచనా వేశారు. ఈ సంద ర్భంగా ఎస్‌ఐ చౌడయ్య మాట్లా డుతూ బియ్యం తరలిస్తున్న వాహ నాలపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ఈ బియ్యం గతేడాది అదే రైస్‌ మిల్లులో పట్టుబడిన 1,600 బస్తాలకు సంబంధించినవిగా మిల్లు యజ మానులు చెబుతున్నట్లు ఆయన తెలిపారు. తాము స్వాదీనం చేసు కున్న రేషన్‌ బియ్యాన్ని పరిశీలన నిమిత్తం మార్టూరు తహశీల్దారు ఈదా వెంకటరెడ్డికి అప్పగించినట్లు ఎస్‌ఐ తెలిపారు.