
బెంగళూరు : రైలు కిందపడి ఒకే కుటుంబానికి చెందిన నలుగురు వ్యక్తులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ ఘటన కర్ణాటకలోని రారుబాగ్ తాలూకాలో బుధవారం రాత్రి జరిగింది. మృతులను అన్నప్ప (60), మహాదేవి (50), సంతోష్ (26), దత్తాత్రేయ (28)గా గుర్తించామని, వీరిది రాయ్బాగ్ తాలుకలోని భీరాడి గ్రామమని అధికారులు తెలిపారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియలేదని అన్నారు. అప్పుల బాధ కారణమై ఉండవచ్చని.. ఆ దిశగా దర్యాప్తు చేపట్టామని అన్నారు.