Apr 11,2021 15:13

అనంతపురం : రాయదుర్గం పట్టణంలోని ప్రభుత్వాసుపత్రిలో సిఐడి అధికారులు ఆదివారం తనిఖీలు నిర్వహించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు 14 అంశాల ఆధారంగా రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ ఆసుపత్రిలో తనిఖీలు నిర్వహిస్తున్నట్లు సిఐడి అధికారులు వెల్లడించారు. ప్రభుత్వాస్పత్రుల్లో కొనుగోలు చేసిన పరికరాల్లో అవినీతి, అక్రమాలు జరిగినట్లు ఆరోపణలు ఉన్న నేపథ్యంలో సిఐడి అధికారులు సోదాలు చేసినట్లు సమాచారం. ప్రభుత్వ ఆసుపత్రిలోని రికార్డులు పరిశీలించారు. ప్రభుత్వ ప్రధాన వైద్యాధికారి మంజువాణితో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా సిఐడి ఇన్‌స్పెక్టర్‌ రుషికేష్‌ మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రభుత్వ ఆస్పత్రుల్లో కొనుగోలు చేసిన పరికరాలపై తలెత్తిన అవినీతి ఆరోపణలపై రాష్ట్రవ్యాప్తంగా సిఐడి అధికారులు సోదాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.