Dec 04,2021 07:19

ప్రజాశక్తి - కర్నూల్‌ స్పోర్ట్స్‌ : కర్నూలు నగరానికి చెందిన షేక్‌ జాఫ్రీన్‌ ఉత్తమ క్రీడాకారిణిగా జాతీయ స్థాయి అవార్డును భారత రాష్ట్రపతి చేతుల మీదుగా శుక్రవారం అందుకుంది. షేక్‌ జాఫ్రీన్‌ మూగ, చెవిటి వారి క్రీడలలో టెన్నిస్‌ క్రీడాకారిణి. టెన్నిస్‌లో ప్రతిభ కనబరుస్తూ పారా ఒలింపిక్స్‌ , వింటర్‌ ఒలింపిక్స్‌లో పతకాలు సాధించింది. మూగ చెవిటి క్రీడలకు సంబంధించి అనేక రాష్ట్ర, జాతీయ స్థాయిలో పలు పతకాలు సాధించిన జాఫ్రీన్‌కు ఉత్తమ క్రీడాకారిణిగా గుర్తించి సత్కరించారు.