Jan 21,2021 18:45

matladutunna kollu ravindra

రాష్ట్రంలో పాలన దుర్మార్గం : కొల్లు
మచిలీపట్నం కల్చరల్‌: రాష్ట్రంలో వైసిపి ప్రభుత్వం దుర్మార్గ పాలనను సాగిస్తోందని టిడిపి పొలిట్‌ బ్యూరో సభ్యులు, మాజీమంత్రి కొల్లు రవీంద్ర విమర్శించారు. తెలుగుదేశం పార్టీ నాయకుల అక్రమ అరెస్టులకు నిరసనగా ఆపార్టీ ఆధ్వర్యంలో మచిలీపట్నం బస్టాండు సెంటర్‌ ఎన్టీఆర్‌ విగ్రహం వద్ద గురువారం నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. కొల్లు రవీంద్ర మాట్లాడుతూ రాష్ట్రంలో పోలీసులతో పాలన సాగిస్తున్నారన్నారు. అడుగడుగునా ప్రతిపక్షాలను అణచివేస్తూ అరాచక పాలన కొనసాగిస్తున్నారన్నారు. రామతీర్థం ప్రాంతాన్ని చంద్రబాబు అనుమతి తీసుకుని సందర్శించారన్నారు. ఎలాంటి ముందస్తు అనుమతి లేకుండా విజయసాయిరెడ్డి అక్కడ మత వైషమ్యాలు రెచ్చగొట్టేలా వ్యవహరిస్తే అక్కడి ప్రజలు చెప్పులను ఆయన మీద వేశారని విమర్శించారు. దాన్ని జీర్ణించుకోలేక కళా వెంకట్రావుపై అక్రమ కేసులు పెట్టి అరెస్ట్‌ చేశారన్నారు. అన్ని విషయాలను ప్రజలు గమనిస్తున్నారన్నారు. అన్నింటికి సమాధానం ప్రజలే చెబుతారన్నారు. అధికారం ఎవ్వరికీ శాశ్వతంగా ఉండబోదన్నారు. మాజీ ఛైర్మన్‌ బాబా ప్రసాద్‌, పార్టీ అధ్యక్షులు ఇలియాస్‌, కుంచె నాని, మహిళా పార్లమెంట్‌ అధ్యక్షురాలు స్వర్ణలత, మరకాని పరబ్రహ్మం, కాంతారావు, శివకోటి రాజేంద్రప్రసాద్‌, గనిపిశెట్టి గోపాల్‌, కట్టా అంజిబాబు, లంకిశెట్టి నీరజ, కరెడ్ల సుశీల, బత్తిన దాసు, అక్కుమహంతి రాజా, మురాల ప్రసాద్‌, తెలుగు యువత మరకాని వాసు, టౌన్‌ హాల్‌ మాజీ చైర్మన్‌ చిన్నం శివ, టెంకాల రమణ, దిలీప్‌ కుమార్‌, తలారి రాంబాబు, పీవీ ఫణి కుమార్‌, కసాని భాగ్యరావు, బడుగు ఉమాదేవి, బొడ్డు శ్రీనివాస్‌, హాస్పిటల్‌ మాజీ డైరెక్టర్‌ అజీమ్‌, రాజు, అంగర తులసి, భాస్కర్‌ రావు, ఉకంటి రాంబాబు, యువరాజు, తెలుగు యువత సలీమ్‌, శ్రీదేవి, ప్రమీల, అప్పాయమ్మ పాల్గొన్నారు.