Jan 12,2021 11:48

అమరావతి: రాష్ట్రాన్ని యువత చక్కదిద్దాలని టిడిపి అధినేత చంద్రబాబు పిలుపునిచ్చారు. కక్షలు, విధ్వంసాలు లేని సమాజాన్ని ఆవిష్కరించాలని కోరారు. మంగళవారం ఆయన యువతకు యువజన దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఐదేళ్ల టిడిపి పాలనలో రాష్ట్రాన్ని పెట్టుబడులు గమ్యంగా మార్చామన్నారు. వైసిపి ప్రభుత్వం అధికారం చేపట్టాక రాష్ట్ర భవిష్యత్తును అంధకారం చేసిందని విమర్శించారు. అప్పుల ఊబిలోకి దింపి అధ:పాతాళానికి నెట్టిందన్నారు. టిడిపి తెచ్చిన పెట్టుబడులు, పరిశ్రమలన్నింటినీ తరిమేసి అభివృద్ధిని ఆపేశారని మండిపడ్డారు. అలాగే యువతకు ఇచ్చిన హామీలను గాలికొదిలేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయ ఉగ్రవాదంతో అన్నితరగతుల ప్రజలను భయకంపితులను చేస్తున్నారన్నారు. బిసి, ఎస్టీ, ముస్లిం మైనారిటీలపై జరుగుతున్నంత దాడులు ఏ రాష్ట్రంలోనూ జరగడం లేదని ఆరోపించారు.