Jul 30,2021 21:00

gamgineni prasad

రాష్ట్రానికి కేంద్రం న్యాయం చేయాలి
జాతీయ బీసీ సంఘం రాష్ట్ర ఆర్గనైజింగ్‌ సెక్రటరీ గంగినేని ప్రసాద్‌
ప్రజాశక్తి-మండవల్లి
ఎన్నికల్లో ఇచ్చిన హామీలను వెంటనే బిజెపి ప్రభుత్వం ద్వారా ప్రధాని మోడీ అమలు చేయాలని డిమాండ్‌ చేస్తూ జంతర్‌ మంతర్‌ వద్ద ధర్నా కార్యక్రమం నిర్వహించనున్నట్లు జాతీయ బీసీ సంఘం రాష్ట్ర ఆర్గనైజింగ్‌ సెక్రటరీ గంగినేని ప్రసాద్‌ తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌కు న్యాయం చేయాలని కేంద్రాన్ని కోరతామన్నారు. రాజ్యసభ,పార్లమెంటు సభ్యులు విజయసాయిరెడ్డి వైసిపి ఎంపీలు పార్లమెంటులో చేస్తున్న పోరాటానికి మద్దతుగా ఢిల్లీలోని జంతర్‌మంతర్‌ వద్ద ధర్నా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ ధర్నాలో ఏలూరు పార్లమెంట్‌ పరిధిలోని సుమారు 30 మంది సభ్యులతో కూడిన బందం ఆగస్టు 2,3,4 తేదీల్లో ధర్నాలో నిర్విరామంగా పాల్గొంటారని ఆయన తెలిపారు. దేశ ప్రధాని మోడీ ఎన్నికల ప్రచారంలో భాగంగా తిరుపతి, భీమవరంలో నిర్వహించిన బహిరంగ సభలలో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తానని ప్రత్యేక నిధులు కూడా ఇచ్చి అభివద్ధికి తోడ్పాటు అందిస్తామని హామీ ఇచ్చారని గుర్తుచేశారు.