
ప్రజాశక్తి - వేంపల్లె :కడప జియోన్ కళాశాలలో జరిగిన కబడ్డీ పోటీల్లో రాష్ట్ర స్థాయి కబడ్డీకి దేవి జూనియర్ కళాశాల విద్యార్థులు ఎంపికైనట్లు కరస్పాండెంట్ శ్రీకాంత్‌రెడ్డి చెప్పారు. గురువారం ఆయన పోటీలకు ఎంపికైన విద్యార్థులను అభినందించారు. విద్యా ర్థులు క్రీడల్లో రాణించేందుకు కృషి చేస్తున్న పిఇటి రవిశంకర్‌ను అభినందించారు. రాష్ట్రస్థాయిలోనూ విద్యార్థులు రాణించాలని ప్రిన్సిపాల్ శివలింగారెడ్డి ఆకాంక్షించారు. ఈనెల 25, 26, 27 తేదిల్లో విజయవాడలో జరిగే రాష్ట్ర స్థాయి పోటిలకు తమ కళాశాల విద్యార్థులు హాజరు అవుతున్నట్లు తెలిపారు.