Oct 28,2021 16:13

చిన్నారులను ఓదారుస్తున్న జీడీ నెల్లూరు టీడీపీ ఇన్‌చార్జి చిట్టి బాబు

ప్రజాశక్తి - కార్వేటినగరం : రాందాస్‌ పిల్లలను ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ ద్వారా ఉచిత విద్య అందిస్తామని జీడి నెల్లూరు టిడిపి ఇన్‌చార్జి చిట్టి బాబు నాయుడు అన్నారు. గురువారం కార్వేటినగరం పెద్ద దళితవాడలో రాందాస్‌ విద్యుత్‌ షార్ట్‌ సర్క్యూట్‌ తో 5 రోజుల ముందు మతి చెందిన విషయం తెలిసిందే. అదేవిధంగా రాందాస్‌ భార్య వళ్లెమ్మ 2 సంవత్సరాల క్రితం అనారోగ్యంతో మతి చెందారు. వీరికి ఇద్దరు పిల్లలు, తల్లిదండ్రులు కోల్పోయిన పిల్లలకు నా అనేవారు లేక అనాధలుగా మిగిలారు. మీ చిన్నారులను ఆదుకునే ఉద్దేశంతో జీడీ నెల్లూరు టీడీపీ ఇన్చార్జి చిట్టి బాబు నాయుడు చిన్నారులను ఓదార్చారు. అయినా మాట్లాడుతూ రాందాస్‌ పిల్లలకు ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ ద్వారా ఉచిత విద్య, ఉచిత భోజనం, ఉచిత వసతి కల్పిస్తామని టిడిపి అండగా ఉంటుందన్నారు. మండల కార్యదర్శి ఎం రాజేంద్ర రెడ్డి చిన్నారులకు 1500 ఆర్థిక సహాయం అందించారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు చెంగల్రాయలు యాదవ్‌, ప్రధాన కార్యదర్శి రాజేంద్ర రెడ్డి,రవికుమార్‌, బిగల రమేష్‌, జగన్నాథం, ముని కష్ణయ్య, దాము, తదితరులు పాల్గొన్నారు.