Oct 28,2021 18:32

చిన్నారులను ఓదార్చుతున్న చిట్టిబాబు నాయుడు

ప్రజాశక్తి- కార్వేటి నగరం
రాందాస్‌ పిల్లలకు ఎన్‌టిఆర్‌ ట్రస్టు ద్వారా ఉచిత విద్యను అందిస్తామని జీడీ నెల్లూరు టిడిపి ఇన్‌చార్జి చిట్టిబాబు నాయుడు తెలిపారు. గురువారం కార్వేటినగరం పెద్దదళితవాడలో విద్యుదాఘాతానికి గురై మృతి చెందిన రాందాస్‌ కుటుంబాన్ని పరామర్శించారు. రాందాస్‌ భార్య వల్లెమ్మ రెండేళ్ల క్రితం అనారోగ్యంతో మృతి చెందింది. దీంతో వారి పిల్లలకు తల్లిదండ్రులను కోల్పోయి అనాథలుగా మిగిలారు. ఆ చిన్నారులను చేరదీసి ఎన్‌టిఆర్‌ ట్రస్టు ద్వారా ఉచిత విద్య, వసతి, భోజనం కల్పిస్తామని టిడిపి వారికి అండగా ఉంటుందని హామి ఇచ్చారు. అనంతరం మండల కార్యదర్శి ఎం.రాజేంద్ర రెడ్డి చిన్నారులకు రూ.1500లు ఆర్థిక సాయం చేశారు. కార్యక్రమంలో మండలాధ్యక్షులు చెంగల్రాయులు యాదవ్‌, ప్రధాన కార్యదర్శి రాజేంద్రరెడ్డి, రవి కుమార్‌, బిగల రమేష్‌, జగన్నాథం, ముని కృష్ణయ్య, దాము పాల్గొన్నారు.