Nov 29,2020 23:16

rallapadu

ప్రజాశక్తి-లింగసముద్రం: రాళ్లపాడు ప్రాజెక్టు నుంచి మన్నేరుకు నీటిని విడుదల చేస్తున్నారు. ఆదివారం ఉదయం ఒక గేటు ద్వారా నీటిని విడుదల చేశారు. ప్రాజెక్టులోకి నీటి ప్రవాహం పెరగడంతో 11 గంటల సమయంలో మూడు గేట్లు ఎత్తారు. సాయంత్రా నికి ఇన్‌ఫ్లో తగ్గడంతో రెండు గేట్లు ద్వారా మన్నేరుకు నీరు వదులుతున్నారు. డిఇ లక్ష్మీనారా యణ, ఎఇలు చంద్రమౌళి, పూర్ణచంద్రరావు ప్రాజెక్టు వద్దనే ఉంటూ ఎప్పటికప్పుడు పరిస్థితులను సమీక్షిస్తున్నారు. ప్రాజెక్టులో ప్రస్తుతం 19.5 అడుగులు నీటిమట్టం ఉంది. ప్రాజెక్టులోకి పూర్తి స్థాయిలో నీరు చేరి గేట్లు ద్వారా నీరు విడుదల చేయడంతో చూసేందుకు సందర్శకులు ఆసక్తి చూపుతున్నారు.