Jan 27,2021 00:34

సమావేశమైన ఐద్వా సభ్యులు

ప్రజాశక్తి-మాధవధార : గణతంత్ర దినోత్సవాన్ని పురష్కరించుకొని ఐద్వా ఆధ్వర్యాన కంచరపాలెంలో 'రాజ్యాంగాన్ని రక్షించుకుందాం.. రైతును కాపాడుకుందాం..' అనే కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఐద్వా జోన్‌ కార్యదర్శి పుష్పాంజలి మాట్లాడుతూ, నేడు రాజ్యాంగానికి రక్షణ కరువైందన్నారు. రాజ్యాంగ విరుద్ధంగా రైతు, కార్మిక చట్టాలను పాలకులు చేస్తున్నారని తెలిపారు. రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా రైతులు పోరాటంలో అశువులు బాస్తున్నా ప్రభుత్వం చలించటం లేదన్నారు. రైతులను, రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉందన్నారు. రైతు లేని భారతదేశాన్ని ఊహించలేమని పేర్కొన్నారు. అందరి ఆకలి తీర్చే అన్నదాతలు ఆకలి చావులకు బలికావటం భరించరానిదని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజా నాట్యమండలి నగర కార్యదర్శి జి.రమణ, ఐద్వా నాయకులు లావేటి లక్ష్మి, శారద పాల్గొన్నారు.