Nov 21,2020 20:38

హైదరాబాద్ : బుల్లితెర నటుడు గెటప్‌ శ్రీను హీరోగా సాయి వరుణవి క్రియేషన్స్‌ బ్యానర్‌పై ప్రశాంత్‌ రెడ్డి నిర్మిస్తోన్న చిత్రం 'రాజు యాదవ్‌'. ఐఐటీ మద్రాస్‌లో ఇంటర్నేషనల్‌ స్క్రీన్‌ రైటింగ్‌ కోర్స్‌ చేసి, 'విన్సెంట్‌ ఫెరర్‌' అనే స్పానిష్‌ ఫిల్మ్‌కు అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా, తెలుగులో 'నీదీ నాదీ ఒకే కథ', 'విరాటపర్వం' చిత్రాలకు చీఫ్‌ అసోసియేట్‌ డైరెక్టర్‌గా పనిచేసిన కృష్ణమాచారి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. హీరోయిన్‌గా అంకిత కరత్‌ నటిస్తున్నారు. శనివారం ఈ సినిమా షూటింగ్‌ లాంఛనంగా ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి డైరెక్టర్‌ సాగర్‌ కె. చంద్ర క్లాప్‌ నిచ్చారు. కమర్షియల్‌ హంగులకు దూరంగా, వాస్తవికతకు దగ్గరగా ఈ సినిమా ఉంటుందని దర్శకుడు తెలిపారు. హర్షవర్ధన్‌ రామేశ్వర్‌ సంగీతం అందిస్తున్నారు. డిసెంబర్‌ మొదటి వారం నుంచి రెగ్యులర్‌ షూటింగ్‌ ప్రారంభమవుతుంది.