Oct 27,2021 22:17

- రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి, కొనకళ్ళ జగన్నాధరావు
ప్రజాశక్తి కలక్టరేట్‌ :
రాజధాని రైతులు నిర్వహించే పాదయాత్రకు టిడిపి పూర్తి మద్దతు ఉంటుందని టిడిపి రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి, కొనకళ్ళ జగన్నాధరావు అన్నారు. బుధవారం పార్టీ నాయకులు, కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జగన్నాధరావు మాట్లాడుతూ రాజధాని కోసం ఇన్ని రోజులు ఉద్యమం చేస్తున్న వైసిపి ప్రభుత్వానికి చీమకుట్టినట్లుగా కూడా లేదన్నారు. ఉద్యమాన్ని అణచడానికి ఎన్నో కుట్రలు పన్నారని తెలొపారు. రైతులు చేపట్టిన పాదయాత్ర విజయవంతం చేసేందుకు రాజకీయ పక్షాలు కషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పార్టీ మచిలీపట్నం రూరల్‌ అధ్యక్షుడు, కుంచే నాని, పార్లమెంట్‌ ప్రచార కార్యదర్శి, పి.వి. ఫణి కుమార్‌, ఉన్నారు.