
ప్రజాశక్తి- రాజాం : అవినీతి, లంచగొండితనంపై పోరాటానికి శ్రీకారం చుట్టిన రాజాం తహశీల్దార్ వేణుగోపాలరావుకు సోమవారం తహశీల్దార్ కార్యాలయంలో రెడ్‌క్రాస్ చైర్మన్ కొత్తసాయి ప్రశాంత్‌కుమార్ ఆధ్వర్యాన సన్మానించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తహశీల్దార్ కార్యాలయంలో వివిధ పనుల నిమిత్తం వచ్చే వారు సిబ్బందికెవ్వరికీ లంచం ఇవ్వవద్దని నోటీసు బోర్డు అంటించడం అభినందనీయమన్నారు. లంచగొండితనం రూపుమాపాలని సంకల్పంతో తహశీల్దార్ తీసుకొన్న నిర్ణయాన్ని అందరూ స్వాగతించాలని కోరారు. కార్యాలయంలో ఎవరికీ లంచం ఇవ్వలేదని ప్రమాణపత్రం అందజేయడం నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని సూచించడం ఆయన అందరికీ ఆదర్శప్రాయుడు అన్నారు. ఇటీవల ఆయన తీసుకున్న నిర్ణయానికి కలెక్టర్ జె.నివాస్ అభినందించారు. కార్యక్రమంలో కొల్లూరు తిరుమలశ్వరరావు, ఉల్లాకుల నీలకంటేశ్వర యాదవ్, బిఎస్ఎన్ఎల్ విశ్రాంత ఉద్యోగి నక్క తవిటయ్య, కార్యాలయ సిబ్బంది సాయి కామేశ్వరరావు, రంజిత్ తదితరులు పాల్గొన్నారు.