Sep 14,2021 18:40

ఐపిఎల్‌ రెండో దశలో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు(ఆర్సీబీ) జట్టు తమ మొదటి మ్యాచ్‌లో ఎరుపు రంగు జెర్సీలో కాకుండా బ్లూ కలర్‌ జెర్సీలో బరిలోకి దిగనుంది. సెప్టెంబర్‌ 20న కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో ఆడే తొలి మ్యాచ్‌లో ఆర్సీబీ ఆటగాళ్లు ఆ జెర్సీని ధరించి మ్యాచ్‌ బరిలోకి దిగనున్నారు. ఎందుకంటే.. రెండేళ్లుగా కరోనాపై పోరాటం చేస్తున్న ఫ్రంట్‌లైన్‌ వారియర్స్‌కి కృతజ్ఞతగా రెడ్‌ కలర్‌ జెర్సీకి బదులుగా బ్లూ కలర్‌ జెర్సీని కోహ్లి సేన ధరించనుంది. 'కోవిడ్‌ మహమ్మారికి వ్యతిరేకంగా పోరాటానికి నాయకత్వం వహిస్తున్న ఫ్రంట్‌ లైన్‌ వారియర్స్‌ అమూల్యమైన సేవకు నివాళి అర్పించేందుకు... ఫ్రంట్‌లైన్‌ యోధుల పిపిఇ కిట్‌ల రంగును పోలివుండే బ్లూ జెర్సీని ధరించడం ఆర్సీబీ సభ్యులుగా మాకు గర్వకారణం' అని ట్విట్‌ చేసింది.