Nov 25,2021 20:47

పారిస్‌ : ఫ్రాన్స్‌ ప్రధాని జేన్‌ కాస్టెక్స్‌కు సోమవారం కరోనా సోకింది. పొరుగున గల బెల్జియంలో పర్యటించి వచ్చిన కొద్ది గంటలకే బయటపడినట్లు ప్రధాని కార్యాలయం వెల్లడించింది. రాబోయే పది రోజులు ఆయన క్వారంటైన్ లో  వుండి తన కార్యకలాపాలు నిర్వహిస్తారని ప్రధాని కార్యాలయం ప్రకటించింది. కాస్టెక్స్‌కు వైరస్‌ లక్షణాలేమైనా వున్నాయా లేదా అనేది అధికారులు పేర్కొనలేదు. బ్రస్సెల్స్‌లో బెల్జియం ప్రధానితో భేటీ అనంతరం కాస్టెక్స్‌ తిరిగి వచ్చిన తర్వాత ఆయన కుమార్తెల్లో ఒకరికి కరోనా సోకింది. దాంతో ఆయన కూడా రెండుసార్లు పరీక్షలు చేయించుకోగా, రెండింట్లోనూ పాజిటివ్‌ రిపోర్టు వచ్చిందని ప్రధాని కార్యాలయం తెలిపింది. ఫ్రాన్స్‌లో 75శాతం జనాభా వ్యాక్సిన్‌ వేయించుకున్నారు. అయినా ఇటీవలి వారాల్లో కేసులు చాలా త్వరగా పెరుగుతున్నాయి. ఆస్పత్రుల్లో చేరాల్సిన కేసులు, మరణాలు కూడా పెరుగుతున్నాయి.