Apr 08,2021 19:35

భార్యభర్తల మధ్య అనుబంధాలను తెలియజెప్పే పాయింట్‌తో 'చెరసాల' సినిమా రూపొందుతోంది. శ్రీజిత్‌, రామ్‌ ప్రకాష్‌ గుణ్ణం, నిష్కల, శిల్పా దాస్‌ హీరో, హీరోయిన్లుగా, రామ్‌ ప్రకాష్‌ గుణ్ణం దర్శకత్వంలో మద్దినేని సురేష్‌ సుధారారు నిర్మిస్తున్నారు. ఫీల్‌ గుడ్‌ లవ్‌ స్టోరీగా రూపొందిన ఈ సినిమా పోస్ట్‌ప్రొడక్షన్‌ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. త్వరలో ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తామని యూనిట్‌ తెలియజేస్తోంది. ఇటీవలే ఎస్‌వి.కృష్ణారెడ్డి, ప్రసన్నకుమార్‌ ఆవిష్కరించిన టీజర్‌, ట్రైలర్‌కు మంచి స్పందన వచ్చిందని చిత్రబృందం పేర్కొంది.