Nov 25,2021 20:36

విభిన్న కథాంశాలతో సినిమాలు చేసే శర్వానంద్‌ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం 'ఒకే ఒక జీవితం'. కొద్ది రోజులుగా ఈ చిత్రం ఓటీటీ వేదికగా విడుదల కానుందని, మేకర్స్‌ సైతం అదే ప్లాన్‌లో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కానీ ఈ చిత్రం వచ్చే ఏడాది ఫిబ్రవరిలో భారీగా విడుదల చేసేందుకు చిత్రబృందం ఏర్పాట్లు చేస్తోంది. డ్రీమ్‌ వారియర్స్‌ బ్యానర్‌పై ప్రభు ఎస్‌ఆర్‌ నిర్మిస్తున్న ఈ చిత్రానికి శ్రీ కార్తీక్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో హీరోయిన్‌గా రీతూ వర్మ, కీలక పాత్రలో అక్కినేని అమల నటిస్తున్నారు. ఈ చిత్రానికి జేక్స్‌ బెజొయ్  సంగీతం అందిస్తున్నారు.