Oct 28,2021 19:14

ampikena kridakarulu

ఫెన్సింగ్‌ జిల్లా బాల, బాలికల జట్టు ఎంపిక
ప్రజాశక్తి-గన్నవరం
గన్నవరం బాలుర హైస్కూల్‌లో గురువారం కోవిడ్‌ నిబంధనలు పాటిస్తూ సబ్‌ జూనియర్‌ విభాగంలో 12 మంది బాలికలు, 12మంది బాలురు, జూనియర్‌ విభాగంలో 12 మంది బాలికలు,12మంది బాలురు, సీనియర్‌ విభాగంలో 8 మంది మెన్‌ , 8 మంది ఉమెన్స్‌ కృష్ణా జిల్లా ఫెన్సింగ్‌ టీమ్‌కు ఎంపికయ్యారని జిల్లా ఫెన్సింగ్‌ అసోసియేషన్‌ కార్యదర్శి నాగం సతీష్‌ బాబు తెలిపారు. జిల్లా నలుమూలల నుండి 150 ఫెన్సింగ్‌ క్రీడాకారులు పాల్గొన్నారు. ఎంపికైన వారంతా శుేక్రవారం నుంచి కాకినాడలో జరిగే రాష్ట్ర ఫెన్సింగ్‌ ఛాంపియన్‌షిప్‌లో పాల్గొంటారని తెలిపారు. ఈ కార్యక్రమంలో సీనియర్‌ కోచ్‌ ధనియాల నాగరజు పాల్గొన్నారు.