Oct 28,2021 20:43

మాట్లాడుతున్న టిఎఎస్‌ బృందం

మాట్లాడుతున్న టిఎఎస్‌ బృందం
ఫైలేరియా నివారణకు అవగాహన
ప్రజాశక్తి-మర్రిపాడు:మండలంలో గురువారం టిఎఎస్‌ బందం పర్యటించి ఫైలేరియా పై సర్వే చేశారు. ఏపిలి కుంట,అనంతపురం,మర్రిపాడు,నందవరం ఉర్దూ ప్రాథమిక పాఠశాలలో డాక్టర్‌ పీవీ కిషోర్‌ ఆధ్వర్యంలో 6నుంచి 7సంవత్సరాల లోపు విద్యార్థిని విద్యార్థులకు రక్త పరీక్షలు చేసి ఫలితం ప్రకటించగా ఎవరికి ఎటువంటి వ్యాధులు లేవని నిర్ధారించారు.
కార్యక్రమంలో గండిపాలెం సూపర్‌ వైజర్‌ ఎస్‌కె అక్బర్‌ బాషా,ఎస్కే ఖాజా మొహిద్దీన్‌, హెల్త్‌ అసిస్టెంట్‌ బి వెంకటేశ్వర్లు,ల్యాబ్‌ టెక్నీషియన్‌ పీవీ రత్నం,ఏ ఎన్‌ ఎం ఎస్కే జమీల,సచివాలయం ఏ ఎన్‌ ఎం భాగ్యలక్ష్మి,ఆశా వర్కర్లు రమాదేవి, ఉపాధ్యాయులు రత్నయ్య,వెంకటరెడ్డి పాల్గొన్నారు.