Oct 28,2021 19:23

ninadalu chestunna janasena nayakulu

పవన్‌ యాత్రను విజయవంతం చేయాలి : జనసేన
ప్రజాశక్తి-మచిలీపట్నం కల్చరల్‌
విశాఖ ఉక్కు పరిరక్షణ పేరుతో ఈనెల 31న విశాఖపట్నంలో తమ పార్టీ అధ్యక్షుడు పవన్‌ కళ్యాణ్‌ యాత్రను విజయవంతం చేయాలని జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు బండ్రెడ్డి రామకష్ణ కోరారు. మచిలీపట్నంలోని జిల్లా పార్టీ కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎందరో త్యాగమూర్తుల త్యాగఫలంతో ఏర్పడిన విశాఖ ఉక్కును ప్రైవేటీకరణ చేయడాన్ని తెలుగువారు వ్యతిరేకిస్తున్నారన్నారు. నియోజకవర్గ ఇన్చార్జి బండి రామకష్ణ, జిల్లా ప్రధాన కార్యదర్శి లంకిశెట్టి బాలాజీ మాట్లాడుతూ 25 మంది పార్లమెంట్‌ సభ్యులు ఉండి అధికార పార్టీ తరపున గళం విప్పకపోవడం శోచనీయమన్నారు. మచిలీపట్నం నుండి తిరుపతి రైలు రద్దయిన, దూరదర్శన్‌ కేంద్రం తరలిపోయిన బందరు పార్లమెంట్‌ సభ్యులు పెదవి విప్పకపోవడం బాధాకరమన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంయుక్త కార్యదర్శి జన్ను నాగరాజు, ఊరిమి సర్పంచ్‌ సురేష్‌, గిరి, చక్రి, మైకేల్‌ రమేష్‌, పవన్‌ కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.