
ప్రజాశక్తి - ఏలేశ్వరం 'ఈ ఏడాది జూన్ 26న ఏలేశ్వరానికి చెందిన పొట్నూరి శివశంకర్ మృతి చెందడంతో అతని కుటుంబానికి భూపతిపాలెం పూర్వ విద్యార్థుల సంఘం రూ.లక్ష ఆర్థిక సాయమందించింది.' అతని కుటుంబ సభ్యులను సంఘం అధ్యక్ష కార్యదర్శులు ఎం.రత్న కుమార్, కార్యదర్శి జి.వెంకటశ్రీను, కోశాధికారి ఎన్.అచ్చిరెడ్డి, పిబి.శ్రీనివాస్ పరమహంస, అలమండ నాగేంద్ర, సునీల్ సుధాకర్, అప్పారెడ్డి, వర్మ, నీలి శ్రీనివాస్, పట్టాభి రామయ్య, గంగా ప్రసాద్, రాంబాబు పరామర్శించారు.