
పురస్కారం అందుకుంటున్న సామ్రాట్ కుమార్
ప్రజాశక్తి - అనకాపల్లి
కరోనా సమయంలో సేవలందించిన సచివాలయ, వాలంటరీ సిబ్బందికి అబ్దుల్ కలాం సేవ సంస్థ పురస్కారాలను అందజేసిది. సంస్థ కార్యాలయంలో వ్యవస్థాపక అధ్యక్షుడు ఆళ్ల ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో అందజేశారు. ఈ కార్యక్రమ ంలో సంస్థ గౌరవ అధ్యక్షులు కాండ్రేగుల శ్రీరామ్, 80వ వార్డు కార్పొరేటర్ అభ్యర్థి కొణతాల భాస్కరరావు, గ్రామ సచివాలయ అడ్మిన్ గణేష్, సంస్థ సభ్యులు కొణతాల రాజు, మోహన్, ఆల్ల నరేంద్ర కుమార్, ధనుంజరు, శ్రీను, కుమార్ తదితరులు పాల్గొన్నారు.
జానకిరావుకు అభినందనలు
ముంచంగిపుట్టు: మండలంలో బంగారు మెట్ట పంచాయితీ కేంద్రానికి చెందిన తలారి జానకి రావుకు గోల్డ్ మెడల్‌తో పాటు రాష్ట్రస్థాయి సేవ రత్న అవార్డు రావడంపై కుటుంబ సభ్యులు, గ్రామస్తులు, స్నేహితులు హర్షం వ్యక్తం చేశారు. సోమవారం వారు స్థానిక విలేకరులతో మాట్లాడుతూ, విశాఖ పోర్టు ట్రస్ట్‌లో మెరైన్ డిపార్ట్మెంట్లో సెరాంగ్ గ్రేడ్-1గా విధులు నిర్వర్తిస్తున్న జానకిరావుకి ఈనెల 24న బాపూజీ కల్చరల్, సోషల్ ఆర్గనైజేషన్ వారు మదర్ థెరిసా సేవ రత్న, సేవ భూషణ్, సేవ జ్యోతి అవార్డులు అందించారన్నారు. అభినందనలు తెలిపిన వారిలో రామారావు, బొంజుబాబు, బోడి రాజు, సుధీర్ కుమార్, చిట్టిబాబు ఉన్నారు.
సబ్బవరం :మండలంలోని అమతపురం గ్రామానికి చెందిన జిల్లా బహుజన దళిత బహుజన సేన అధ్యక్షులు గొటివాడ సామ్రాట్ కుమార్‌కు విశాఖ రత్న పురస్కారం లభించింది. ఆయన సోమవారం విలేకరులతో మాట్లాడుతూ, విశాఖలోని వైశాఖి జల ఉద్యానవనంలోని దాసరి నారాయణరావు కల్చరల్ అకాడమీ ఆధ్వర్యంలో ప్రతిభవంతులకు పట్టాబి óషేకం నిర్వహించారని చెప్పారు. గొటివాడ సామ్రాట్ కుమార్‌కు అవార్డు దక్కడంపై దళిత నాయకులు హర్షం వ్యక్తం చేశారు.