Nov 27,2020 22:22

రాహుల్‌ దర్శకత్వంలో నాని హీరోగా రూపొందుతున్న 'శ్యామ్‌ సింగరారు' చిత్రంలో ముగ్గురు హీరోయిన్లు నటించనున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే సాయి పల్లవి, కృతి శెట్టి ఎంపికయ్యారు. పునర్జన్మ ప్రేమ కథ కాన్సెప్ట్‌తో ఈ సినిమా రూపొందుతోంది. మూడో హీరోయిన్‌గా అదితి రావు హైదరిని తీసుకోనున్నట్లు సమాచారం. వచ్చే ఏడాది మార్చికి సినిమా పూర్తి అయ్యేలా ప్లాన్‌ చేస్తున్నట్లు చిత్ర యూనిట్‌ తెలిపింది.