Mar 02,2021 21:14

ప్రజాశక్తి - కుకునూరు
          పోలవరం నిర్వాసితులకోసం మండలంలో నిర్మిస్తున్న పునరావాసకాలనీ నిర్మాణ పనులు వేగవంతం చేయాలని ఐటిడిఎ పిఒ ఆర్‌వి.సూర్యనారాయణ కోరారు. కుకునూరు, వేలేరుపాడు మండలాల్లోని పోలవరం నిర్వాసితుల కోసం కివ్వాక, చిరవల్లి గ్రామాల్లో నిర్మిస్తున్న పునరావాస కాలనీ నిర్మాణ పనులను పిఒ మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మే నెలాఖరు నాటికి నిర్మాణ పనులు పూర్తి చేయాలని, రెండు నెలల్లో నిర్వాసితులను ఆ కాలనీలకు తరలించాల్సి ఉందని, సంబంధిత అధికారులు పూర్తిస్థాయిలో దృష్టిపెట్టాలని ఆదేశించారు. నిర్మాణపనులను నాణ్యతతో గడువు సమయానికి పూర్తి చేయాలన్నారు. అలసత్వం వహిస్తే సహించబోమన్నారు.