Apr 11,2021 15:52

విజయనగరంటౌన్‌: జ్యోతిరావుపూలే, వారి సతీమణి సావిత్రిబాయ్ పూలే నిస్వార్థ సేవలనందించిన మహానీయులని , వారిద్దరూ అమర జీవులుగా ప్రజల గుండెల్లో నిలిచి ఉంటారని జిల్లా కలెక్టర్‌ డా.ఎం. హరిజవహర్‌లాల్‌ పేర్కొన్నారు. జ్యోతిరావుపూలే 195వ జయంతి ఉత్సవాల సందర్భంగా కలెక్టరేట్‌ ఆవరణలో పూలే దంపతుల విగ్రహాలకు ఆదివారం కలెక్టర్‌, సంయుక్త కలెక్టర్లు, ఇతర అధికారులు పూల మాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. సంయుక్త కాలెక్టర్లు డా.జి.సి.కిషోర్‌ కుమార్‌, జె వెంకటరావు, బిసి సంక్షేమ జిల్లా అధికారి డి.కీర్తి, బి.సి సొసైటీ ఇడి ఆర్‌.నాగరాణి, బి.సి ఉద్యోగుల సంఘం ప్రతినిధులు, జిల్లా బిసి కులాల అసోసియేషన్‌ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.