Jan 13,2022 19:30

చిట్టోడమ్మా...చిట్టోడు
చిట్టి పలక పట్టాడు
పలకపైన రాశాడు
తప్పులన్నీ చేసాడు
తప్పుతెలిసి సరిదిద్దాడు
పట్టుదలతో నేర్చాడు

చిన్నోడమ్మా...చిన్నోడు
చిన్ని సైకిల్‌ కొన్నాడు
సైకిల్‌ ఎక్కి తొక్కాడు
సైకిల్‌ జారి పడ్డాడు
పడినా లేచి తొక్కాడు
పట్టుదలతో నేర్చాడు

బుల్లోడమ్మా... బుల్లోడు
బోలెడు ఆటలు ఆడాడు
ఆటలన్నిటిలో ఓడాడు
ఓడినా తెలుసుకున్నాడు
పట్టుదలతో మళ్ళీ ఆడాడు
అన్ని ఆటలలో గెలిచాడు

- కయ్యూరు బాలసుబ్రమణ్యం
94417 91239