Feb 05,2021 00:02

విజయసాయి రెడ్డిని సన్మానిస్తున్న విజయప్రసాద్‌ పివి.సురేష్‌ తదితరులు

ప్రజాశక్తి -ములగాడ
పశ్చిమ నియోజకవర్గం వైసిపి కార్యాలయంలో పార్టీ సమీక్షా సమావేశం గురువారం నిర్వహించారు. ఈ సమావేశానికి రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. నియోజకవర్గంలోని వార్డు అభ్యర్థులతో సమస్యలపై చర్చించారు. ఈ సందర్భంగా విజయసాయిరెడ్డి మాట్లాడుతూ, ప్రతి వార్డులో ప్రజలకు ఎటువంటి సమస్యా లేకుండా చూడాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు. అనంతరం వార్డుల అభ్యర్థులు విజయసాయిరెడ్డిని సత్కరించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు ముత్తంశెట్టి శ్రీనివాసరావు, మాజీ డిప్యూటీ మేయర్‌ దాడి సత్యనారాయణ, పీవీ.సురేష్‌, పుర్రె పూర్ణశ్రీ, యాదవ్‌, కృష్ణ, దాడి సూర్యకుమారి, దాడి సత్యనారాయణ (డిపో), బద్రీనాథ్‌, గుండప్ప నాగేశ్వరరావు, గులివింద లావణ్య, లక్ష్మణరావు పాల్గొన్నారు