
ప్రజాశక్తి- సీతంపేట : సీతంపేటలో పర్యాటకాభివృద్ధికి కృషి చేస్తానని కలెక్టర్ జె.నివాస్ అన్నారు. సోమవారం జగతిపల్లి యు పాయింట్‌ను పరిశీలించారు. ఈ మేరకు సీతంపేట ఐటిడిఎలో చేపడుతున్న పర్యాటక పనులపై సమగ్ర నివేదిక తయారు చేసి అందజేయాలని పర్యాటకశాఖ ఇంజినీర్లకు ఆదేశించారు. అనంతరం గ్రామస్తులతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ మేరకు జగతిపల్లి గ్రామస్తులు తాగునీటి సమస్య పరిష్కరించాలని, వాటర్ ట్యాంక్ నిర్మించాలని విన్నవించారు. కమ్యూనిటీ హాలు నిర్మించాలని కోరారు. కొండ చీపుర్లను బయట మార్కెట్లో అమ్మితే గిరిజన సహకార సంస్థ అధికారులు అడ్డుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై కలెక్టర్ స్పందిస్తూ... ఈ సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని మామీనిచ్చారు. కార్యక్రమంలో ఐటిడిఎ పిఒ సిహెచ్.శ్రీధర్, ట్రైబల్ వెల్ఫేర్ ఇఒ జి.మురళి, డిడి కమల, ఎపిఒ ఎల్.ఆనందరావు, తహశీల్దార్ రమేష్‌కుమార్, ఎంపిడిఒ మహేశ్వరరావు, మండల ప్రత్యేకాధికారి శ్రీనివాసరావు పాల్గొన్నారు.