Nov 30,2020 21:20

శనగ పంట ు పరిశీలిస్తున్న ఎంపీ అవినాష్‌ రెడ్డి.

వేముల నివర్‌ తుపాను వల్ల నష్టపోయిన ప్రతి ఒక్క రైతును ఆదుకుంటామని కడప పార్లమెంటు సభ్యుడు వై.ఎస్‌. అవినాష్‌రెడ్డి పేర్కొన్నారు. తుపాన్‌ కారణంగా మండలంలోని గొందిపల్లెలో దెబ్బతిన్న శనగ పంటను పాడా ఒఎస్‌డి అనిల్‌కుమార్‌రెడ్డి, వైసిపి మండల కన్వీనర్‌ నాగెళ్ళ సాంబశివారెడ్డి, జడ్‌పిటిసి అభ్యర్థి కోగటం వెంకట భయపు రెడ్డి, మాజీ జడ్‌పిటిసి మొరంరెడ్డి రాజారెడ్డి, మండల ఎన్నికల పరిశీలకులు రామలింగారెడ్డి, రైతు నాయకులు చల్లా వెంకటనారాయణలతో కలిసి సోమవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ మండల వ్యాప్తంగా నివర్‌ తుపాన్‌ వల్ల 3500 హెక్టార్ల పైనే శనగ పంట, కొన్ని వందల హెక్టార్లలో పత్తి పెసర, అరటి మొదలైన పంటలను రైతులు నష్టపోయారని పేర్కొన్నారు. అధికారులు వెంటనే రైతులను ఆదుకునేందుకు ఈ క్రాప్‌ ద్వారా మొత్తం పంట నష్టాన్ని నమోదు చేయాలన్నారు, వ్యవసాయ అధికారులు పంచాయతీ వారిగా దెబ్బతిన్న ప్రతి పంటనూ గుర్తించాలన్నారు. శనగ పంట నష్ట పోయినా తిరిగి సాగు చేసుకునేందుకు 80 శాతం సబ్సిడీతో విత్తనాలు అందిస్తామని, నష్టపోయిన ప్రతి కుటుంబాన్ని ఆదుకునేందుకు ప్రభుత్వానికి నివేదిక పంపిస్తామని చెప్పారు. ఇన్‌పుట్‌ సబ్సిడీ కూడా అమలు చేస్తామని పేర్కొన్నారు. తుపాను వల్ల నష్టపోయిన గొర్రెల కాపరులను ఆదుకుంటామని, వర్షం వల్ల కూలిపోయిన ఇళ్ల స్థానంలో కొత్త వాటిని మంజూరు చేసేందుకు చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు. వారితోపాటు ఎడిఎ రమణ రెడ్డి, హెచ్‌ఒ రాఘవేందర్‌ రెడ్డి, చెన్నారెడ్డి, తహశీల్దార్‌ నరసింహులు, డాక్టర్‌ శ్రీ వాణి, మాజీ ఎంపిటిసి మల్‌ రెడ్డి, రాధాకష్ణయ్య, బస్‌ సుబ్బారెడ్డి, రాఘవరెడ్డి. మదర్‌వల్లి, ఇసి ప్రసాద్‌ రెడ్డి, ఎదుల భాస్కర్‌ రెడ్డి, అర్‌ గంగిరెడ్డి ఉన్నారు.