Feb 11,2021 23:45

మాట్లాడుతున్న పీడీసీసీబీ చైర్మన్‌ మాదాసి వెంకయ్య

ప్రజాశక్తి-మర్రిపూడి: ప్రతిపక్షాలను నమ్మి మోసపోవద్దని గ్రామాలను అభివృద్ధి చేయడం ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డికే సాధ్యమని పిడిసిసి బ్యాంక్‌ ఛైర్మన్‌, కొండపి నియోజకవర్గ వైసిపి ఇన్‌చార్జి డాక్టరు మాదాసి వెంకయ్య అన్నారు. మండలం లోని మర్రిపూడి, జువ్విగుంట, తంగెళ్ల, అయ్యప్పరాజుపాలెం గ్రామాల్లో వైసిపి బలపరిచిన అభ్యర్థుల ఎన్నికల ప్రచారంలో గురువారం ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాదాసి వెంకయ్య మాట్లాడుతూ ఇప్పటికే 20 నుండి 30 శాతం పంచాయతీలు ఏకగ్రీవమయ్యా యన్నారు. ప్రజలు ప్రతిపక్షాల జిత్తులమారి మాటలు నమ్మి మోసపోవద్దన్నారు. నీతివంతమైన పాలన అందిస్తున్న వైసిపి ప్రభుత్వంపై ప్రజలు ఎంతో నమ్మకంతో ఉన్నారని అన్నారు. పేద లబ్ధిదారులైన ప్రతి కుటుంబానికి సంక్షేమ పథకాల ద్వారా సుమారు 60 వేలు అందించి, వారి అభివృద్ధికి వైసిపి ప్రభుత్వం తోడ్పడిందని అన్నారు. తాగునీటి సమస్య పరిష్కారానికి రూ.38 కోట్ల నిధులతో మండలంలో ప్రతి ఇంటికీ 50 లీటర్లు తాగునీరు అందే విధంగా పనులు ప్రారంభించినట్లు గుర్తు చేశారు. వైసిపి బలపరిచిన అభ్యర్థుల గుర్తులను చూపించి ప్రచారం నిర్వహించారు. వైసిపి నాయకులు మాచేపల్లి నాగయ్య మాట్లాడుతూ ఎమ్మెల్యే స్వామి కరోనా కాలంలో పనులు లేక పేదలు ఇబ్బందులు పడుతుంటే వారి బాగోగులు పట్టించుకో లేదని విమర్శించ ారు. నాయకులు, ప్రజల మధ్యనే ఉంటూ వారి అవసరాలు తీర్చిన ఘనత వైసిపికే దక్కుతుందన్నారు. జిల్లా నాయకులు పల్లెర్ల నరసింహారెడ్డి మాట్లాడుతూ పంచాయతీ సర్పంచులుగా వైసిపి బలపరచిన అభ్యర్థులను గెలిపించుకోవాలని కోరారు. మండలంలో 21 పంచాయతీలలో 8 పంచాయతీలు ఏకగ్రీవమవ్వగా 7 పంచాయతీలు వైసిపియే వశం చేసుకున్నాయన్నారు. మిగిలిన 13 గ్రామ పంచాయతీల అభ్యర్థులను గెలిపించాల న్నారు. వైసిపి జిల్లా ప్రధాన కార్యదర్శి వాకా వెంకటరెడ్డి మాట్లాడుతూ పంచాయతీ ఎన్నికలలో సైతం మ్యానిఫెస్టో విడుదల చేసి ప్రజలను మోసం చేయాలని చూస్తు న్నారన్నారు. ప్రతిపక్షాల మోసపూరిత మాటలు నమ్మవద్దని అన్నారు. సంక్షేమ పథకాలను చూసి ఎవరికి ఓటు వేయాలో ప్రజలకే తెలుసు అని ఆయన చెప్పారు. కార్యక్రమంలో మండల వైసిపి కన్వీనరు బోదా రమణారెడ్డి, మర్రిపూడి చిమట త్రిమెన్‌ కమిటీ ఛైర్మన్లు డివి భాస్కరరెడ్డి, ఎం.వెంకట్రావు, తూగుట్ల నరసారెడ్డి, కంజుల రమణారెడ్డి, కంజుల బ్రహ్మారెడ్డి, రావులపల్లి నాగరాజు, గింజు పిచ్చయ్య పాల్గొన్నారు.