Mar 02,2021 23:30

సదస్సులో మాట్లాడుతున్న మురళీకృష్ణ

ప్రజాశక్తి - గండేపల్లి 'మండలంలోని సూరంపాలెం ఆదిత్య విద్యాప్రాంగణంలోని పాలిటెక్నిక్‌ కళాశాలల మొదటి సంవత్సరంలో చేరిన విద్యార్థులకు విద్య ప్రాముఖ్యతను గురించి అవగాహన సదస్సు నిర్వహించారు.' ఈ సదస్సులో ముఖ్య అతిథిగా హాజరైన ప్రముఖ రచయిత మనోవికాస శాస్త్ర నిపుణులు ప్రొఫెసర్‌ డాక్టర్‌ సి.హెచ్‌.మురళీకృష్ణ మాట్లాడుతూ పాలిటెక్నిక్‌ పట్టాతోపాటు మంచి సంస్థలో ఉద్యోగంతో విద్యార్థి బయటకు రావాలంటే ఆంగ్లభాషపై పట్టు, వినూత్నంగా ఆలోచించడం, నూతన ఆలోచనలతో రాణించిన వారే తమ లక్ష్యాలను సాధించడం సాధ్యమని అన్నారు. విద్య అంటే ఎలా నేర్చుకోవాలో తెలుసుకోవడం అని.. నేర్చుకున్న విద్యనభ్యసించడం ఆచరణలో పెడితే విద్యార్థులు మున్ముందుకు సాగుతూ ఉన్నతస్థాయికి చేరుకుంటారని అన్నారు. ప్రతి విషయంపైనా అవగాహన కలిగి ఉండాలని అన్నారు. ఆకలింపుచేసుకుని అర్ధం కాని అంశాలను ఉపాధ్యాయుల నుంచి తెలుసుకునేందుకు ప్రయత్నించాలని అన్నారు. నిరంతరాయంగా నేర్చుకుంటూ తెలీని విషయాలను తెలుసుకునేందుకు సిగ్గూ మొహమాటం లేకుండా ఉండటమే మంచి విద్యార్థి లక్షణమని అన్నారు. ఈకార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్‌ ఎస్‌టివిఎస్‌.కుమార్‌, డీన్‌ ఎవి.మాధవరావు, ఉపాధ్యాయ సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.