Oct 27,2021 22:48

పొలాలలో కూలీలకు వ్యాక్సిన్‌ వేస్తున్న దృశ్యం

ప్రజాశక్తి - నంద్యాల క్రైమ్‌: కోవిడ్‌ మొదటి డోసు వేయించుకున్న వారు రెండో డోసు తప్పనిసరిగా వేయించుకోవాలని హెల్త్‌ ఎడ్యుకేటర్‌ పామన్న తెలిపారు. బుధవారం నంద్యాల మండలం పొన్నాపురం గ్రామ పొలిమేరలోని పొలాల్లో పని చేస్తున్న వ్యవసాయ కూలీలకు, ఇటుక బట్టీల్లో పని చేస్తున్న కార్మికులకు అవగాహన కల్పించి కోవిడ్‌ వ్యాక్సిన్‌ వేయించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ రెండు మోతాదులు కోవిడ్‌ వాక్సిన్‌ వేయించుకోవడం వల్ల కరోనా వైరస్‌ ఉత్పరివర్తనం చెందినప్పటికీ అంతగా ప్రమాదం ఉండదన్నారు. కార్యక్రమంలో ఆరోగ్య కార్యదర్శులు ఉమాదేవి, లక్ష్మి, మహిళా పోలీస్‌ పద్మావతి, వెల్ఫేర్‌ అసిస్టెంట్‌ నగ్మా, ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు.