Oct 28,2021 14:17

ప్రజాశక్తి -పిచ్చాటూరు
పిచ్చాటూరు మండలం లోని కీళపూడి గ్రామంలో చిత్తూరు జిల్లా డిప్యూటీ డైరెక్టర్‌ బీసీ వెల్ఫేర్‌ కుష్భు కొరాటి, పిచ్చాటూరు నాగలాపురం మండలం కోవిడ్‌ వ్యాక్సినేషన్‌ ప్రత్యేక అధికారి గురువారం గ్రామాల్లో తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గ్రామాల్లో ప్రజలు ప్రతి ఒక్కరు వ్యాక్సినేషన్‌ తప్పక వేయించుకోవాలన్నారు. వ్యాక్సినేషన్‌ వల్ల రోగనిరోధక శక్తి పెరగడమేకాకుండా , ఆరోగ్యంగా ఉంటారన్నారు. వైద్య అధికారులు ఏఎన్‌ఎంలు, ఆశా వర్కర్లు బాధ్యతగా టీకాలు వేయాలని ఆదేశించారు.ఈ కార్యక్రమంలో పిచ్చాటూరు తహశీల్ధార్‌ టీవీ సుబ్రహ్మణ్యం, ఎంపీడీవో శ్రీనివాసులు, డాక్టర్‌ హమీద్‌, పంచాయతీ కార్యదర్శులు, ఏఎన్‌ఎంలు, వాలంటర్ల్లు పాల్గొన్నారు.