Sep 24,2021 01:51

ఆధార్‌ కార్డులు అందజేస్తున్న జిల్లా ప్రధాన న్యాయమూర్తి హరిహరినాథ్‌ శర్మ

కలెక్టరేట్‌ : ఏ మనిషికైనా గుర్తింపు అవసరమని జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవా సదన్‌ చైర్మన్‌ హరి హరనాథ శర్మ అన్నారు. టిఎస్‌ఆర్‌ కాంప్లెక్స్‌ రెండవ అంతస్తులో ఉన్న ఎయుటిడి జివిఎంసి నిరాశ్రయుల వసతిగృహంలో గురువారం 160 మంది నిరాశ్రయులకు ఆధార్‌ కార్డులను ఆయన పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ కూడు, గూడు, గుడ్డతో పాటు వైద్యం, విద్య, న్యాయం వంటివి పొందాలంటే ప్రతి మనిషికి ఆధార్‌ వంటి గుర్తింపు కార్డులు అవసరం ఎంతైనా ఉందన్నారు. ఉచిత లీగల్‌ ఎయిడ్‌ ద్వారా షెల్టర్‌ల సమస్యలను నేరుగా స్టేట్‌ లీగల్‌ సర్వీస్‌ అథారిటీకి, హైకోర్టుకు పిల్‌ ద్వారా తెలియజేసి న్యాయం సహాయం అందిస్తానని హామీ ఇచ్చారు. డిఎల్‌ఎస్‌ఎ కార్యదర్శి, సీనియర్‌ సివిల్‌ జడ్జి కెకెవి.బులికృష్ణ, మహిళా న్యాయవాది లక్ష్మీ రాంబాబు, 32వ వార్డు కార్పొరేటర్‌ కందుల నాగరాజు, ఎయుటిడి కార్యదర్శి ప్రగాఢ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.