Oct 27,2021 22:58

- మేయర్‌ గంగాడ సుజాత
ప్రజాశక్తి-ఒంగోలు సబర్బన్‌: 
క్లీన్‌ ఆంధ్రప్రదేశ్‌(క్లాప్‌)లో భాగంగా నగరంలో ప్రతి ఇంటికీ మూడు చెత్త బుట్టలను ఉచితంగా అందజేయనున్నట్లు నగర మేయర్‌ గంగాడ సుజాత తెలిపారు. చెత్త బుట్టల పంపిణీ కార్యక్రమం బుధవారం నగరంలోని 45వ డివిజన్‌ పరిధిలో సీతారాముల దేవస్థానం వద్ద, 35వ డివిజన్‌లో ఉమామహేశ్వర కళాశాల వద్ద జరిగింది. ఈ కార్యక్రమాల్లో మేయర్‌ పాల్గొని బుట్టలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తడి చెత్త, పొడి చెత్త, హానికరమైన చెత్తను వేరు చేసి రిక్షాలకు అందించాలని కోరారు. నగరంలో ప్రతి ఇంటికీ మూడు చెత్త బుట్టలు ఉచితంగా ఇస్తామని చెప్పారు. వైసిపి యువ నాయకులు బాలినేని ప్రణీత్‌రెడ్డి మాట్లాడుతూ క్లీన్‌ ఆంధ్రప్రదేశ్‌ సాధనే ప్రభుత్వ ధ్యేయమని పేర్కొన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ మేయర్‌ వేమూరి బుజ్జి, 45వ డివిజన్‌ కార్పొరేటర్‌ వెన్నపూస కుమారి, 35వ డివిజన్‌ కార్పొరేటర్‌ ఆదిపూడి గిరిజా శంకర్‌ శాండిల్యా, వైసిపి నాయకులు వెన్నపూస వెంకటేశ్వరరెడ్డి, కండె రమణాయాదవ్‌ పాల్గొన్నారు.