Jan 21,2021 21:28

చిప్పగిరి పోలీసు స్టేషన్‌ లో సమావేశం లో మాట్లాడుతున్న డీఎస్పీ వినోద్‌ కుమార్‌

ప్రజాశక్తి - చిప్పగిరి :గ్రామాల్లో అసాంఘిక కార్యకలాపాలకు అడ్డుకట్ట వేసేందుకు ప్రతి గ్రామంలో రక్షణ దళం అనే కమిటీ ఏర్పాటు చేస్తున్నామని డీఎస్పీ వినోద్‌ కుమార్‌ తెలిపారు. గురువారం చిప్పగిరి పోలీసు స్టేషన్‌లో ఎస్‌ఐ సతీష్‌ కుమార్‌ ఆధ్వర్యంలో చిప్పగిరికి చెందిన 15 మందితో గ్రామ రక్షణ దళం కమిటీ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడారు. గ్రామాల్లో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే, సమస్యలు వచ్చినా పోలీసు స్టేషన్‌కు సమాచారం ఇస్తారన్నారు. స్థానిక ఎన్నికలు ఎప్పుడు జరిగినా ప్రశాంతంగా నిర్వహించుకోవడానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. సిఐ భాస్కర్‌ నాయుడు పాల్గొన్నారు.