Mar 02,2021 23:31

ఎన్నికల ప్రచారం చేస్తున్నా సిపిఎం నాయకులు

ప్రజా సమస్యలపై నిత్యం పోరాడుతాం : సిపిఎం
ప్రజాశక్తి - ఆత్మకూరు:
 ఆత్మకూరు మున్సిపల్‌ ఎన్నికలలో ప్రజా సమస్యలపై ప్రశ్నించే గొంతుక గరీబ్‌ నగర్‌ 19వ వార్డు సిపిఎం అభ్యర్థి ఆకుతోట రణధీర్‌ను గెలిపించాలని ఆ పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఏ.రాజశేఖర్‌ గరీబ్‌ నగర్‌ ప్రజలను కోరారు. మంగళవారం సిపిఎం నాయకులు, కార్యకర్తలు, వార్డు ప్రజలతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 1978లో వీధి ప్రజలు, పెద్దలతో కలుపుకొని గరీబ్‌ నగర్‌గా నామకరణం రిజిస్ట్రేషన్‌ చేసుకొని నాటి నుంచి నేటి వరకు కాలనీ అభివృద్ధి చేసిన ఘనత సిపిఎందేనని అన్నారు. గరీబ్‌ నగర్‌ ప్రజలకు ఏ ఆపద వచ్చినా అందుబాటులో ఉంటూ పరిష్కరిస్తున్నట్లు తెలిపారు. గరీబ్‌ నగర్‌ అభివృద్ధికి బాటలు వేసింది సిపిఎం అని అన్నారు. కాలనీలో వరదలు వచ్చినా, అగ్ని ప్రమాదాలు జరిగినా, వీధిలో సిమెంట్‌ రోడ్స్‌, మంచి నీటి పైపులైన్లు, డ్రైనేజీ సమస్య, ఓవర్‌హెడ్‌ ట్యాంక్‌ తదితర సమస్యల పరిష్కారం కోసంకాలనీ ప్రజలను కలుపుకొని పోరాటాలు చేసి పరిష్కరించింది సిపిఎం అని, ఈ నెల 10న జరిగే మున్సిపల్‌ ఎన్నికల్లో 19వ వార్డు నుంచి పోటీ చేస్తున్న అభ్యర్థి ఆకుతోట రణధీర్‌ సుత్తి కొడవలి నక్షత్రం గుర్తుపై ఓటు వేసి, వేయించి గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో సిపిఎం నాయకులు డి.రామ్‌ నాయక్‌, సి.వెంకటేశ్వర్లు, ఆర్‌.విభాస్కర్‌, శ్యాలు, టి.శివ కుమార్‌, గణపతి, ఏ.కిరణ్‌ కుమార్‌, మహబూబ్‌ బాష తదితరులు పాల్గొన్నారు.