Nov 25,2021 19:43

న్యూఢిల్లీ :  2050 నాటికి ఉత్తర అమెరికా, యూరోప్‌ దేశాల్లో కారు వినియోగం తగ్గుతుందని అంచానా వేశారు. అయితే ఆసియా ఖండంలో మాత్రం ప్రయాణాలకు అత్యంత అనువుగా, సాధారణంగా వినియోగించే వాహనంగా కారు ప్రయాణాలు మారతాయని పేర్కొన్నారు. వచ్చే మూడు దశాబ్దాల్లో ఆసియా దేశాల్లో ప్రయాణాలకు కార్ల వినియోగం 40 శాతం కన్నా ఎక్కువ పెరుగుతుందని అంచనా వేయబడింది. అయితే 2015లో కేవలం 28 శాతానికి పెరిగింది.

2050 నాటికి ఆసియాలో కారు ప్రయాణాల వాటా యూరప్‌ (44 శాతం), లాటిన్‌ అమెరికా (42 శాతం)కి చేరుకుటుందని, కొంతమేర తగ్గినప్పటికీ.. ఉత్తర అమెరికాలో మాత్రం అత్యధికంగా 76 శాతంగా ఉంటుందని అంచనా వేయబడింది.

21వ శతాబ్దపు నగరాల్లో ఆసియా పసిఫిక్‌ ప్రాంతం పట్టణ పరివర్తనగా మారుతుందని ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన స్వతంత్ర మీడియా ఎంఐటి టెక్నాలజీ రివ్యూ నివేదికలో తేల్చింది. ఆసియా పసిఫిక్‌ ప్రపంచంలోనే అత్యంత అధునాతన ప్రజా రవాణా వ్యవస్థలకు నిలయంగా మారుతుందని, అయితే వివిధ దేశాల అభివృద్ధి స్థితి మరియు గ్రామీణ, పట్టణ ప్రాంతాల అభివృద్ధిలో భారీ వ్యత్యాసాల కారణంగా ఆసియా ఖండం అభివృద్ధి చెందుతున్నపుడు వాహనాల వినియోగం భారీగా పెరుగుతుందని ఎంఐటి టెక్నాలజీ రివ్యూ నివేదికలో పేర్కొన్నారు.

సుదీర్ఘ సుస్థిరమైన విధానాలను అమలు చేయడం ద్వారా, 2050 నాటికి ఆసియాలో కారు ప్రయాణాల వాటా 16-19 శాతానికి పరిమితం కావచ్చని నివేదిక నిర్థారించింది. ఆఫ్రికా, యూరప్‌, లాటిన్‌ అమెరికాల్లో కారు ప్రయాణాలను సమానంగా తగ్గించడం సాధ్యమవుతుందని అధ్యయన కర్తలు భావిస్తున్నారు. కార్ల తయారీ సంస్థలు భావిస్తున్నారు. ఉత్తర అమెరికా, మధ్యప్రాచ్యంలో కారు వినియోగాన్ని తక్కువస్థాయికి తగ్గించడం కూడా కష్టతరంగా మారుతుందని నివేదికలో పేర్కొన్నారు.