Nov 28,2020 01:20

గీతం యూనివర్సిటీ

విశాఖపట్నం : ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాలలోని విశ్వవిద్యాలయాలలో ఉన్నత విద్యా ప్రమాణాలను పాటించే విశ్వవిద్యాలయాలను గుర్తించి ఏటా వెయ్యి అగ్రశ్రేణి విద్యాలయాల జాబితాను ప్రకటించే క్యూఎస్‌ (క్వాకరెల్లి సైమండ్స్‌) సంస్థ జాబితాలో గీతం డీమ్డ్‌ విశ్వవిద్యాలయం భారత దేశంలో 80వ ర్యాంకును సాధించింది. ఆసియా ఉపఖండంలో 501 నుంచి 550 ర్యాంకుల మధ్య నిలిచింది. విశ్వవిద్యాలయం నిర్వహించే కోర్సులు, పరిశోధనల స్థాయి, విద్యార్థులకు లభిస్తున్న ఉద్యోగ అవకాశాలు, అంతర్జాతీయ విద్యార్థుల సంఖ్య, ప్రముఖ జర్నల్స్‌లో ప్రచురితమైన పరిశోధనా ఫలితాలు వంటి అంశాలను పరిశీలించిన మీదట క్యూఎస్‌ ప్రతి ఏటా విశ్వవిద్యాలయాలకు ప్రపంచ ర్యాంకింగ్‌లను ప్రకటిస్తుంది. విశ్వవిద్యాలయాలు ప్రతిష్ఠాత్మకంగా భావించే క్యూఎస్‌ ర్యాంకింగ్‌లో గీతంకు స్థానం లభించడం పట్ల వైస్‌ ఛాన్స్‌లర్‌ ప్రొఫెసర్‌ కె.శివరామకృష్ణ అధ్యాపకులకు, పరిశోధకలకు, విద్యార్థులకు అభినందనలు తెలిపారు.