Jan 21,2021 19:39

సీనియర్‌ నటుడు కృష్ణరరాజు తమ సొంత బ్యానర్‌లో తెరకెక్కుతున్న 'రాథేశ్యామ్‌' మూవీలో పరమహంస అనే పాత్రలో కనిపించబోతున్నారు. కష్ణంరాజు, ప్రభాస్‌ కాంబినేషన్‌లో ఐదారు సన్నివేశాలు ఉండబోతున్నాయి. ఈ సన్నివేశాలు మినహా సినిమా మొత్తం పూర్తయింది. ఈ ప్రత్యేక పాత్ర కోసం కష్ణంరాజు గెడ్డం పెంచుతున్నారు. సినిమాలో ఈ పాత్ర ఎంతో కీలకంగా ఉంటుందని ఆయన చెబుతున్నారు. ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్‌ జరుపుకుంటున్న 'రాథేశ్యామ్‌' చిత్రం సమ్మర్‌ స్పెషల్‌గా విడుదలవుతుందని కష్ణంరాజు తన పుట్టిన రోజు సందర్భంగా తెలిపారు. యువి క్రియేషన్స్‌ ప్రమోద్‌, వంశీతో కలిసి కష్ణంరాజు కుమార్తె ప్రసీద చిత్ర నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.