Jan 14,2021 10:45

ప్రకాశం : తెలుగు రాష్ట్రాల్లో భూకంపం ప్రకంపనలు సృష్టిస్తోంది. నిన్న హైదరాబాద్‌లోని కూకట్‌పల్లిలో స్వల్ప భూకంపం సంభవించిన సంగతి తెలిసిందే. నేడు ప్రకాశం జిల్లాలోనూ భూమి కంపించింది. జిల్లాలోని బల్లికురవ మండలంలో అర్ధరాత్రి స్వల్ప భూకంపం సంభవించింది. అర్ధరాత్రి 1.25 గంటల సమయంలో రెండు సెకండ్ల పాటు భూమి కంపించినట్లు స్థానికులు చెబుతున్నారు.