Oct 28,2021 21:01

నినాదాలు చేస్తున్న నాయకులు

నినాదాలు చేస్తున్న నాయకులు
ప్రజలపై పెనుభారం మోపుతున్న కేంద్రాన్ని మట్టుపెట్టాలి

:నెల్లూరు రూరల్‌ :పెంచిన పెట్రోల్‌ డీజిల్‌ గ్యాస్‌ ధరలను వెంటనే తగ్గించాలని కోరుతూ నెల్లూరు రూరల్‌ మండలంలోని పొట్టే పాలెం గ్రామంలో కార్డులతో నిరసన తెలియజేయడం జరిగినది ఈ కార్యక్రమంలో పాల్గొన్న సిఐటియు జిల్లా కార్యదర్శి కామ్రేడ్‌ అజరు కుమార్‌ మాట్లాడుతూ అసలే కరోనాతో పనులు లేక జనం అల్లాడుతుంటే పెట్రోలు డీజిల్‌ గ్యాస్‌ ధరలు ప్రతిరోజు పెంచి సామాన్య ప్రజానీకం పై భారాలు మోప డా న్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని అన్నారు. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు చాలా తక్కువగా ఉన్నప్పటికీ పన్నుల రూపంలో కోట్లాది రూపాయలు సామాన్య ప్రజలపై మోపి కార్పొరేట్‌ వ్యాపారస్తులకు రాయితీలు ఇవ్వడం ఎంతవరకు సమంజసమని అన్నారు. ఇప్పటికైనా కార్పోరేట్‌ లపై పన్నులు వేసి సామాన్యులపై వేస్తున్న పన్నులను తగ్గించి, పెట్రోలు డీజిల్‌ గ్యాస్‌ ధరలను తగ్గేలా చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో లో సిపిఎం నాయకులు పొట్టే పాలెం చంద్రమౌళి, ఆలూరి తిరుపాలు, అల్లాడి గోపాల్‌, ఎస్‌.కె చాంద్‌ భాషా, డక్క సురేష్‌, కొత్త పెంచలయ్య, ముత్యాల ఆదయ్య తదితరులు పాల్గొన్నారు.