
వేంపల్లె (వైఎస్ఆర్ కడప): పెట్రోల్, డీజిల్‌పై కేంద్ర ప్రభుత్వం పెంచిన సుంకాన్ని తగ్గించాలని పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ తులసిరెడ్డి డిమాండ్ చేశారు. శుక్రవారం వేంపల్లెలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పెట్రోల్, డీజిల్ పెంపునకు నిరసనగా ఆటోకు తాడుతో లాగి పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ తులసిరెడ్డి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెట్రోలు, డీజిల్ ధరలు పెంపుపై చమురు కంపెనీలు కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం, రాష్ట్రంలోని వైసిపిలు అమానుషంగా ప్రవర్తించడం శోచనీయమన్నారు. కరోనా లాక్ డౌన్, తుఫాను కారణంగా ప్రజలు ఆర్థిక ఇబ్బందుల్లో ఉంటే పుండు మీద కారం చల్లినట్లు పెట్రోల్ డీజిల్ ధరలు పెంచడం దుర్మార్గమన్నారు. కాంగ్రెసు పాలనలో అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు బ్యారల్‌కు 40 డాలర్లు వున్నప్పుడు భారత్‌లో లీటర్ పెట్రోల్ 38 రూపాయలు, డీజిల్ 25 రూపాయలు ఉండేది అన్నారు. బ్యారల్ ముడిచమురు ధర 140 డాలర్లు ఉన్నప్పుడు లీటర్ పెట్రోల్ 70 రూపాయలు, డీజిల్ 60 రూపాయలతో సరఫరా చేయడం జరిగిందని తెలిపారు. అంతర్జాతీయ మార్కెట్లో బ్యారల్ ముడిచమురు ధర 40 డాలర్లు వున్నప్పటికీ పెట్రోల్ రూ.90 రూపాయలు, డిజల్ ధర 80 రూపాయలు దాటడడం విడ్డూరం అన్నారు. ప్రజల నుండి పట్టపగలే నిలువ దోపిడి చేస్తున్నారని తెలిపారు. పెట్రోల్‌పై కేంద్ర ప్రభుత్వం ఎక్స్కెజ్ సుంకం దాదాపు 33 రూపాయలు వేయడం జరిగిందని చెప్పారు. జగన్ ప్రభుత్వం లీటర్ పెట్రోల్, డీజిల్ పై 5రూపాయాలు అదనపు వ్యాట్ విధించడం జరిగిందని తెలిపారు. వైకాపా ప్రభుత్వం విధించిన అదనపు వ్యాట్‌ను తగ్గించాలని కోరారు. చమురు కంపెనీలు అంతర్జాతీయ మార్కెట్లో ధరలకు అనుగుణంగా పెట్రోల్, డీజిల్ ధరలు ఉండే విధంగా చూడాలని కోరారు. ఎన్ఎస్ యుఐ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ధఅవకుమార్ రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి రామకఅష్ణ, ఉత్తన్న, బద్రీనాథ్, రామయ్య, రాఘవయ్య, రవి, మురళీ, సుబ్బరాయుడు, నాగరాజు పాల్గొన్నారు.